
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టును బీజేపీ మొదటి నుంచి సమర్థించిందన్న ఆయన… గోదావరి జలాల సాధన కోసం ముందు నుంచి బీజేపీ పోరాడిందన్నారు. ఐతే ప్రాజెక్టు విషయంలో నెలకొన్న అనుమానాలను కేసీఆర్ నివృత్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తారో స్పష్టత లేదని…ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు మురళీధర్ రావు.