బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..ప్రొటోకాల్ పాటించడం లేదు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..ప్రొటోకాల్ పాటించడం లేదు

హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖుల విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాలు జరిగే HICC నోవాటెల్ కు జాతీయ నేతలతో పాటు..రాష్ట్ర నేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. కానీ వీరి విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని బీజేపీ నేత విమర్శించారు.

70 నుంచి 75 మందికి ప్రొటోకాల్ ఉందన్నారు. ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల వచ్చే అతిథులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులకు తాము మూడు రోజల ముందే సమాచారం ఇచ్చామన్నారు. కానీ అధికారులు, ఇతరులతో కో ఆర్డినేషన్ చేయడం లేదని, ఇబ్బందులను పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ దీనిపై అధికారులు మరో విధంగా స్పందిస్తున్నారు. వారు అధికారికంగా రావడం లేదని, పార్టీ పరంగా వస్తున్నారని తెలిపారు. ప్రొటోకాల్ ఉన్న వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు.

ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుండటంతో...సిటీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇప్పటికే HICCని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది SPG.  HICC దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు అధికారులు. ఎల్లుండి సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే విజయ సంకల్ప సభకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెక్యూరిటీ నుంచి వంటల వరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ సంకల్ప  సభలో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు బహిరంగ సభలో పాల్గొంటారు.