చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం : వివేక్ వెంకటస్వామి

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం : వివేక్ వెంకటస్వామి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంత కష్టం వచ్చినా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఏ వర్గం వారికి అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. 

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేడ్కర్ రాజ్యాంగంలో రాశారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఇదే విషయాన్ని ప్రస్తావించానని గుర్తు చేశారు. లేబర్ యాక్ట్, మినిమం వర్కింగ్ అవర్స్ ను కూడా అంబేద్కరే తీసుకొచ్చారని చెప్పారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో అంబేడ్కర్ విగ్రహాన్ని బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, చింతల రాంచంద్రా రెడ్డి, BRS ఎమ్మెల్సీ ఎమ్.ఎస్. ప్రభాకర్ రావు ఆవిష్కరించారు.