
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే.. డబ్బుతో ఏదైనా చేయవచ్చని కలలుగంటున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డి.కె.అరుణ. గురువారం నగరంలోని మణికొండలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆమె.. తెలంగాణ పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికార తెలంగాణ పార్టీ పూర్తిగా దుబ్బాక ఉపఎన్నికపైనే దృష్టి కేంద్రీకరించి, అరాచకాలను చేసిందన్నారు.
తెలంగాణలో పూర్తి అభివృద్ధి జరిగిపోయిందని సీఎం కేసీఆర్ చెబుతున్నారని.. కానీ గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుందని అన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప.. రాష్ట్ర నిధులు లేవని అన్నారు. భరత మాత బిడ్డలమైతే.. తెలంగాణ లాంటి వ్యతిరేక శక్తులను నిలువరించి.. మోడీకి బాసటగా నిలవాలన్నారు. సమాజంలోని చాలా రుగ్మతలకు వ్యతిరేకంగా యువత నిలవాలని, శివాజీ స్ఫూర్తిని యువత కలిగి ఉండాలన్నారు.