దీదీ ఏమీ చేయలె.. బీజేపీ గెలిస్తే కల్లోలమే

దీదీ ఏమీ చేయలె.. బీజేపీ గెలిస్తే కల్లోలమే

కోల్‌‌‌కతా: తృణమూల్ ముక్త్ భారత్ అని బీజేపీ ఎందుకు పిలుపునివ్వడం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎప్పుడూ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ అంటుంది కానీ తృణమూల్ ముక్త్ భారత్ అని ఎందుకు అనడం లేదని క్వశ్చన్ చేశారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. తృణమూల్‌, బీజేపీలపై విమర్శలకు దిగారు. ‘తృణమూల్‌‌ కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. మమత రోడ్లు నిర్మించారా? కాలేజీలు కట్టారా? ఆమె ఏమీ. చేయలేదు. నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి దేశంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మాకు భిన్నంగా ఉంటాయి. మా మధ్య పోరు రాజకీయంగానే కాదు సైద్ధాంతికంగానూ అనేది కాదనలేని నిజం. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని నాశనం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోంది. విభజిత రాజకీయాలు, హింస, విద్వేషం తప్పితే బీజేపీ నుంచి మరేమీ ఆశించలేం’ అని రాహుల్ పేర్కొన్నారు.