సాయంత్రం BJP పార్లమెంటరీ పార్టీ భేటీ : మే 30న మోడీ ప్రమాణం!

సాయంత్రం BJP పార్లమెంటరీ పార్టీ భేటీ : మే 30న మోడీ ప్రమాణం!

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. నరేంద్రమోడీని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ తరపున గెలిచిన ఎంపీల సమావేశం జరగనుంది. అక్కడ కొత్త సభ్యలనుద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.

మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మే 30 న మోడీ ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉంది.