మమత ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పోస్టర్లు

మమత ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పోస్టర్లు

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పార్టీ పోస్టర్లు ఏర్పాటు చేసింది. శనివారం (జులై 16న) పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బ్యానర్లు కనిపించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఉన్న ఫొటో కూడా ఫ్లెక్సీల్లో ఉన్నాయి. ఒడిశాలోని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. 

ఇటు కాంగ్రెస్‌, టీఎంసీ, టీఆర్ఎస్ తో పాటు విపక్ష పార్టీలు యశ్వంత్‌ సిన్హాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మమత ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బ్యానర్లను బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. అనంతరం 21న ఫలితాలను ప్రకటిస్తారు.