ఇయ్యాల్టి వరకు ఒక్క ఓటూ కొనలే . .. అందుకే ఎలక్షన్లలో ఓడిపోయానేమో

ఇయ్యాల్టి వరకు ఒక్క ఓటూ కొనలే . .. అందుకే ఎలక్షన్లలో ఓడిపోయానేమో
  • బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు 

మల్కాజిగిరి, వెలుగు: ‘ఈరోజు వరకూ నేను పోటీ చేసిన ఏ ఎలక్షన్లలోనూ ఒక్క ఓటు కూడా కొనలేదు. బహుశా అందుకే ఓడిపోయి ఉండొచ్చు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు.

 ఈ నెల 17న ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకొని సోమవారం మల్కాజిగిరి లక్ష్మిసాయి గార్డెన్​లో గరికపాటి ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్​రావు మాట్లాడుతూ.. హిందూ బంధువులంతా ధర్మాన్ని నమ్మి ముందుకు నడవాలని, ధర్మం అంతమైన రోజు మన దేశం ఉండదన్నారు. 

మన దేశాన్ని ఎంతమంది విదేశీలయులు పాలించినా, దండయాత్రలు చేసినా మన సంస్కృతిని ఏమి చేయలేకపోయారన్నారు. ఇతర దేశాల్లో క్రిస్టియన్ దేశాలు.. ముస్లిం దేశాలుగా, ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలుగా మారాయని,కానీ మన ధర్మాన్ని నమ్మిన హిందూ దేశం ఎప్పుడూ మారలేదన్నారు.