సంస్కార హీనుల్లా ప్రవర్తిస్తున్నారు

సంస్కార హీనుల్లా ప్రవర్తిస్తున్నారు
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీకి రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నరేంద్ర మోడీ సభ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వారు ఇంత సంస్కార హీనులుగా అయ్యారంటే కారణం.. కంప్లీట్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని అర్థమవుతోందన్నారు.

బీజేపీకి, నరేంద్ర మోడీకి పెరుగుతున్న ఆదరణను చూసి భరించలేక.. జెలసీతో రగిలిపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. తెలంగాణ ప్రజానీకం కలలను.. కల్లలుగా చేసిన టీఆర్ఎస్ నియంతృత్వ, కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని డీకే అరుణ పేర్కొన్నారు.