ఇవాళ జనగామకు బండి సంజయ్ పాదయాత్ర

ఇవాళ జనగామకు బండి సంజయ్ పాదయాత్ర
  • నాకు సమాధానం ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలంటూ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు
  • టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో జనగామలో టెన్షన్

జనగామ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఉత్కంఠ రేపుతోంది. యాదాద్రిలో ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర మరికాసేపట్లో జనగామ పట్టణంలోకి ప్రవేశించనుంది. పదివేల మంది బండి పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. అంతేకాదు.. తన ప్రశ్నావళితో ప్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయించారు. జనగామ చుట్టుపక్కల అంతా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలతో నిండిపోగా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోటాపోటీగా ప్లెక్సీలు పెట్టడం ఉద్రిక్తత సృష్టిస్తోంది. గతంలో జరిగిన ఘటనల  నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.