సిట్టింగులకు బీజేపీ షాక్! యూపీలో 25 మంది ఎంపీలకు సీట్లు లేనట్లే

సిట్టింగులకు బీజేపీ షాక్! యూపీలో 25 మంది ఎంపీలకు సీట్లు లేనట్లే

80 లోక్‌‌సభ స్థానాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు లో ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. 2014లో యూపీలో 71 స్థానాలు గెలుచుకున్న బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . అయితే ఈ సారి జరిగే లోక్‌‌సభ ఎన్నికల్లో మాత్రం ఆచితూచి సీట్లు కేటాయించాలని చూస్తోంది . దీంట్లో భాగంగానే 25 మంది సిట్టింగ్‌‌ ఎంపీలకు సీట్లు కేటాయించకూడదని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించిందని సీనియర్‌‌‌‌ నేతలు చెప్పారు. చాలా మంది సిట్టింగ్‌‌ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఏజెన్సీలతో పాటు పార్టీ కూడా సొంతంగా సర్వే నిర్వహించింది . ఆయా నియోజకవర్గా ల్లో ఎంపీల పనితీరు, అభివృద్ధి తదితర అంశాల ఆధారంగానే ఈ ఎన్నికల్లో సీట్లను కేటాయించనుంది . “ 2014లో ఎన్నికల్లో మోడీ కష్టపడి చాలా సీట్లను సాధించిపెట్టారు. కానీ ఆయా ఎంపీల పనితీరు సంతృప్తికరంగా లేదు. అందుకే వారికి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం” అని పార్టీ సీనియర్‌‌‌‌ నేత ఒకరు మీడియాతో చెప్పారు.

12 లోక్ సభ స్థా నాల్లో అభ్యర్థుల మార్పు
మధ్యప్రదేశ్​లో 12మంది ఎంపీలకు బీజేపీషాక్ ఇచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిటింగ్ లకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది . ప్రజల్లో వారి పై వ్యతిరేకత కారణంగానే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ సీనియర్ నేత ఒకరు శుక్రవారం చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ 18 సిటింగ్ స్థానాల్లో బీజేపీ అ భ్యర్థులను మార్చింది . ‘ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాం. గత నవంబర్ లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 80 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు.