
బీజేపీకి చెందిన సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీనియర్ బీజేపీ లీడర్ కైలాష్ సారంగ్ (85) అనారోగ్య సమస్యలతో మరణించారు. వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కైలాష్ సారంగ్‌ను కుటుంబసభ్యులు 12 రోజుల క్రితం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం మృతిచెందినట్లు ఆయన కుమారుడు, మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.
కైలాష్ సారంగ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కైలాష్ సారంగ్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. కైలాష్ కష్టపడి పనిచేసే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారని ఆయన అన్నారు.
‘మధ్యప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేయడానికి కైలాష్ సారంగ్ జి అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. ఆయన దయార్థహృదయుడు మరియు కష్టపడి పనిచేసే నాయకుడిగా ఆయనను ప్రజలందరూ గుర్తుంచుకుంటారు. కైలాష్ మృతిపట్ల ఆయన కుటుంబానికి మరియు శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నాను’అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Shri Kailash Sarang Ji made stupendous efforts to strengthen the BJP across Madhya Pradesh. He will be remembered as a compassionate and hardworking leader, committed to MP’s progress. Anguished by his demise. Condolences to his family and well-wishers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 14, 2020
For More News..