
బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని.. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలిని ఆమె కోరారు. తనకు మూడు రోజులుగా జ్వరంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆమె తెలిపారు. ఇటీవల హిమాలయాల పర్యటనకు వెళ్లిన ఆమె.. కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ తనకు కరోనా ఎలా సోకిందో తెలియదని అన్నారు. ప్రస్తుతం ఉమా భారతి హరిద్వార్ మరియు రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటానని.. అప్పుడు కూడా పాజిటివ్ వస్తే డాక్టర్లను సంప్రదిస్తానని ఆమె అన్నారు.
For More News..