కేసీఆరే తెలంగాణకు ప్రధాన శత్రువు

కేసీఆరే తెలంగాణకు ప్రధాన శత్రువు

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు ప్రధాన శత్రువు ప్రధాని మోడి కాదని, కేసీఆర్ అవినీతి, కుటుంబ- నియంతృత్వ రాజకీయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ తరుణ్ చుగ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు కేసీఆర్ పాలనకు ముక్త్, ప్రజాస్వామ్యానికి మార్గం చూపుతుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడితే కేసీఆర్‌‌‌‌కు ఎందుకంత భయమని, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వం ముగిసినట్లే, కేసీఆర్‌‌‌‌కు నిరంకుశ పాలనకు ముగింపు వస్తుందన్నారు. అమిత్‌‌‌‌ షా సభతో తెలంగాణలో కుటుంబ రాజకీయాలు, దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కేసీఆర్​ కొన్నాళ్లుగా అధికారం చేజారిపోతుందన్న టెన్షన్​లో ఉన్నారని, అందుకే ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. 

ఇయాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో భేటీ
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో తరుణ్ చుగ్ గురువారం హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరిగే అమిత్​షా సభతో పాటు పార్టీలో చేరికలపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మీటింగ్​లో ప్రధానంగా చర్చించనున్నారు. సాయంత్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగే సభలో చుగ్​ పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని అదే రోజు రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.