నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సంజయ్ టూర్

నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సంజయ్ టూర్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు మూడు విడతలుగా ప్రజా సంగ్రామ పాదయాత్రను విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో జిల్లాల పర్యటన చేపడుతున్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈనెల 10,11 తేదీల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాలో పర్యటించాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిర్ణయించారు.

ముందుగా ఈనెల 10వ తేదీన  ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా తెల్దూరుపల్లెల్లో ఇటీవల హత్యకు గురైన కృష్ణయ్య కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శిస్తారు.  తర్వాత  ఈనెల 11వ తేదీన నల్గొండ జిల్లా మునుగోడులో పర్యటించనున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో మునుగోడు నియోజకవర్గంలో రెండు చోట్ల నిర్వహించే సభల్లో బండి సంజయ్ పాల్గొంటారని సమాచారం.