రాష్ట్రాన్ని అడుక్కునే స్థితికి తెచ్చిన్రు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

రాష్ట్రాన్ని అడుక్కునే స్థితికి తెచ్చిన్రు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
  •     ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేస్తే..  కాంగ్రెస్ అప్పుల్లో ముంచింది 
  •     రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే
  •     వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి జయంతి వేడుకల్లో బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్ల బీఆర్ఎస్ పాల న, రెండేండ్ల కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారైందని.. కేసీఆర్, రేవంత్ కలిసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే.. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ‘బిక్షాందేహీ’ అనే పరిస్థితికి తీసుకువెళ్తోంద ని ఆవేదన వ్యక్తం చేశారు. 

గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి 101వ జయంతి వేడుకలను నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్​తో కలిసి రాంచందర్ రావు వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయించాయని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏఐ సాయంతో గొప్ప ప్రచారాలు చేసుకుంటోందని, గ్రౌండ్ లెవల్​లో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ రైజింగ్’ అని స్లోగన్లు ఇస్తున్నరే తప్ప.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎక్కడు న్నాయని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు దావోస్​కు వెళ్లారు కానీ.. వాస్తవంగా ఒక్క పెద్ద కంపెనీని, తేలేకపోయారని రాంచందర్ రావు మండిపడ్డారు. 

కేసీఆర్ బాటలోనే రేవంత్ భాష .. 

రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడాలంటే వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయిని చూసి నేర్చుకోవాలని రాంచందర్ రావు అన్నారు. వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి పార్లమెంటులో, బయట ఎప్పుడూ నోరు జారి మాట్లాడలేదని, సిద్ధాంతపరమైన విమర్శలే తప్ప వ్యక్తిగత దూషణలు చేయలేదని గుర్తుచేశారు. 

కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో నాడు సీఎం హోదాలో కేసీఆర్ వాడిన భాషనే.. నేడు సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారని మండిపడ్డారు. బూతుల మాటలు, ప్రతీకార రాజకీయాలు, దిగజారుడు భాషతో రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే సాగుతున్నాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు. పేదలకు నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది మోదీ సర్కారేనని చెప్పారు. పల్లెల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, ఇంటింటికీ నల్లా నీళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం అంతా కేంద్రం చలవేనన్నారు. 

వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి స్ఫూర్తితో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, తూళ్ల వీరేందర్ గౌడ్, సీనియర్ నేతలు బంగారు శృతి, శిల్పారెడ్డి పాల్గొన్నారు.