బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో.. 125 మందికి చోటు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో.. 125 మందికి చోటు
  • అన్ని జిల్లాల నేతలకు అవకాశం కల్పించాం : బండి సంజయ్
  • ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మరో 125 మందికి చోటు కల్పించినట్లు ఆ పార్టీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి 125 మంది కార్యవర్గ సభ్యుల పేర్లను మీడియాకు రిలీజ్ చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, మాజీ జడ్పీ చైర్మన్లు అంతా ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.

l    ఆదిలాబాద్: మావల గంగారెడ్డి, నల్ల రత్నాకర్ రెడ్డి
l    మంచిర్యాల: కొయ్యల ఏమాజీ, రాజు
l    నిర్మల్: నారాయణ రెడ్డి, రవి పాండే, అప్పల గణేశ్​చక్రవర్తి, అజ్మీరా హరినాయక్, మోహన్ రావు పాటిల్, మల్లికార్జున్ రెడ్డి, రామారావు పాటిల్.
l    ఆసిఫాబాద్: పాల్వాయి హరీశ్​బాబు, అజ్మీరా ఆత్మరాం నాయక్, కొంగ సత్యనారాయణ.
l    నిజామాబాద్: పెద్దోళ్ల గంగారెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్యాంసుందర్, ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్.
l    కామారెడ్డి: మాల్యాద్రి రెడ్డి, కృష్ణారెడ్డి, క్రిష్ణారెడ్డి.
l    కరీంనగర్: రాజేంద్ర ప్రసాద్, పవన్ కుమార్, నాగేశ్వర్ రెడ్డి.
l    జగిత్యాల: తుల ఉమ, వెంకట్, నవీన్, రాంసుధాకర్.
l    పెద్దపల్లి: వనిత, రాంచందర్, సునీల్ రెడ్డి, సురేశ్ రెడ్డి, పర్వతాలు.
l    సిరిసిల్ల: హనుమంతు గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, రమేశ్, దరువు ఎల్లన్న, చక్రధర్ రెడ్డి.
l    సంగారెడ్డి: రవీందర్, రమేశ్, అంజిరెడ్డి, రాంచందర్ రావు.
l    మెదక్: మురళీ యాదవ్, రాజశేఖర్, ప్రణతి.
l    సిద్దిపేట: విద్యాసాగర్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సురేందర్ రెడ్డి
l    రంగారెడ్డి అర్బన్: గజ్జెల యోగానంద్, రవి యాదవ్, బుక్కా వేణుగోపాల్, మువ్వా సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి.
l    రంగారెడ్డి రూరల్: ఆచారి, శ్రీవర్ధన్ రెడ్డి, ప్రేమ్ రాజ్ యాదవ్, అశోక్ గౌడ్, జంగయ్య యాదవ్, కొలన్ శంకర్ రెడ్డి, నోముల దయానంద్, అందే బాబయ్య.
l    వికారాబాద్: మాధవ్ రెడ్డి
l    మేడ్చల్ అర్బన్: సూర్య ప్రకాశ్, రవీందర్ రావు, రాజేశ్వర్ రావు, శరణ్ కుమార్, పద్మారెడ్డి, మహేశ్.
l    మేడ్చల్ రూరల్: మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శోభ రెడ్డి.
l    నల్గొండ: షణ్ముఖ, జితేంద్ర కుమార్, లాలు నాయక్, రవికుమార్, ఇంద్రసేనా రెడ్డి, శ్రీనివాస రావు, శ్రీదేవి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.
l    సూర్యాపేట: గట్టు శ్రీకాంత్ రెడ్డి
l    భువనగిరి: ధనుంజయ, వీరారెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హరిశంకర్ గౌడ్, పడాల శ్రీనివాస్.
l    మహబూబ్​నగర్: వెంకటేశ్, రవీందర్ రెడ్డి.
l    వనపర్తి: అశ్వథ్థామ రెడ్డి.
l    గద్వాల: యాదగిరి రెడ్డి, వెంకటాద్రి రెడ్డి, బాలే మనెమ్మ.
l    నాగర్ కర్నూల్: కొండా మనెమ్మ యాదవ్.
l    హనుమకొండ: విజయ్ చందర్, రావుల కిషన్, సంతోష్, సాంబయ్య.
l    వరంగల్: ఎర్రబెల్లి ప్రదీప్ రావు, సతీశ్, అశోక్.
l    జనగాం: తిరుపతి రెడ్డి, రామ్మోహన్​రెడ్డి, వెంకటేశ్, వెంకటరెడ్డి.
l    మహబూబాబాద్: సోమయ్య.
l    ఖమ్మం: ఉప్పల శారద.
l    కొత్తగూడెం: రంగా కిరణ్
l    భాగ్యనగర్ మలక్ పేట: వినోద్, హరిగౌడ్.
l    మహంకాళి సికింద్రాబాద్: రవి ప్రసాద్ గౌడ్, దయానంద్, సతీష్ కుమార్, పార్థసారధి, మల్లికార్జున్, పరుశురాం, విజయ్ కుమార్.
l    హైదరాబాద్ సెంట్రల్: రాములు, రమణ్ గౌడ్, దీపక్ రెడ్డి, బాల ప్రకాశ్, మేచినేని శ్రీనివాస్ రావు.

పాత కార్యవర్గంలోనే.. 125 మందిని చేర్చాం: బీజేపీ

పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ గతంలోనే ప్రకటించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గం (కార్యవర్గ సభ్యులతో)లోనే అదనంగా మంగళవారం మరికొంత మందికి సంజయ్ చోటు కల్పించారని పేర్కొన్నారు. కొత్త కార్యవర్గ సభ్యులను నియమించినట్లు కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. పాత రాష్ట్ర కార్యవర్గం అలాగే ఉందని పేర్కొన్నారు. అదే కార్యవర్గానికి అదనంగా కొంత మందిని సభ్యులుగా నియమించారని స్పష్టం చేశారు.