ఎమ్మెల్యే తీరు నచ్చకనే రాజీనామా చేస్తున్నాం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ

ఎమ్మెల్యే తీరు నచ్చకనే రాజీనామా చేస్తున్నాం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ
  • బీజేపీకి గుడ్​బై చెప్పిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఓబీసీ మోర్చా ప్రోగ్రాం కోఆర్డినేటర్ 

కాగ జ్ నగర్, వెలుగు: పదేండ్ల పాటు బీజేపీ కోసం పనిచేసి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే, ఎమ్మెల్యే హరీశ్ బాబు తీసుకుంటున్న నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు నచ్చడం లేదని, అందుకే పార్టీ వీడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రోగ్రాం కోఆర్డినేటర్ గోలెం వెంకటేశ్ పేర్కొన్నారు. బుధవారం కాగజ్ నగర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 నియోజక వర్గంలో ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరు ఇబ్బందికరంగా ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి తన పేరును పరిశీలించాలని తాను కోరినా.. కనీసం సంప్రదించకుండా వేరేవారికి ఇచ్చారని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు. 

పార్టీ పరంగా కార్యక్రమాల నిర్వహణలో సంప్రదించడం లేదని.. విలువ, గౌరవం లేని దగ్గర ఉండడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం బీఆర్ఎస్ లో చేరుతున్నామని చెప్పారు. వారితో పాటు జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షుడు తొగరు ప్రశాంత్, కాగజ్ నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు లైసెట్టి రవికాంత్ ఉన్నారు.