- బీజేపీ నేత వీరేందర్ గౌడ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మార్చబోతున్నారనేది పచ్చి అబద్ధమని, అదంతా కాంగ్రెస్ సోషల్ మీడియా గ్యాంగ్ చేస్తున్న విష ప్రచారమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ‘హైదరాబాద్ యూటీ’ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వానికి హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన గానీ, ఆ దిశగా చర్చ గానీ లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్‌లో ఉందని, రాజకీయ లబ్ధి కోసం దేశంలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. గతంలో రైతులను రెచ్చగొట్టి ఫెయిల్ అయిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉత్తర-, దక్షిణ విభజన పేరుతో కొత్త డ్రామాలు ఆడుతోందని తెలిపారు. హైదరాబాద్ ప్రజల్లో లేనిపోని భయాలు కల్పించేందుకు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు.
