సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఎంపీ అర‌వింద్‌పై దాడి చేశారు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఎంపీ అర‌వింద్‌పై దాడి చేశారు

టీఆర్ఎస్ కిరాయి గుండాలు.. బీజేపీ ఆఫీస్‌పై, ఎంపీ అరవింద్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ అన్నారు. కేసీఆర్ చెంచా గాళ్లు, చేతకాని దద్దమ్మలు ఎంపీ పై దాడి చేశారన్నారు. వరంగల్‌లో ఎంపీ అరవింద్‌పై జ‌రిగిన దాడిపై సంజ‌య్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని బీజేపీ భావిస్తోందన్నారు. టీఆర్ఎస్ నాయ‌కులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డార‌ని, కొంతమంది పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల పై ఉందని చెప్పారు.

బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా బీజేపీ ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదని తెలిపారు. కేసీఆర్, కవిత పై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుస‌ని, వాళ్ళు ఎందుకు అరెస్ట్ కావడం లేదని అన్నారు. బీజేపీపై దాడులకు పాల్పడితే సరైన సమాధానం చెబుతామని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. దాడులతో ప్రతిపక్షాలను-బీజేపీని కట్టడి చేద్దామనుకోవడం మూర్ఖత్వమ‌ని అన్నారు.

కేంద్రం లో బీజేపీ అధికారంలో ఉన్నదనేది టీఆర్ఎస్ మర్చిపోవద్దన్నారు. బీజేపీ నేతల పై దాడి విషయం పై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తామ‌న్నారు. టీఆరెస్ నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన భాద్యత వాళ్ళ పై ఉందని అన్నారు. కరోనా దృష్టిని ప్రజల నుంచి మళ్లించడానికి సచివాలయాన్ని కూల్చుతున్నారని సంజయ్ మండిపడ్డారు.