
ముఖ్యమంత్రి పీఠం కోసం కేటీఆర్, సంతోష్‌రావుల మధ్య పంచాయితీ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కంటోన్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, కంటోన్మెంట్‌కు వచ్చే నిధులన్నీ కేంద్రానివేనన్నారు. కేంద్రం నిధులపై తాను విసిరిన సవాల్‌కు సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర మంత్రులకు అహంకారం నెత్తికెక్కిందన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో తాగుబోతులు, తిగురుబోతులున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్నారు. బీజేపీ ఎక్కడుందో కవిత, బోయినపల్లి వినోద్‌ను అడిగితే తెలుస్తుందన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. హిందువుల దేవుళ్లను అవమాన పర్చిన ఎంఐఎంతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నాడన్నారు. 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడన్నారు. కేసీఆర్‌పై మలిదశ ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.