సీఎం కేసీఆర్ ప‌క్కా దేశ ద్రోహి..

సీఎం కేసీఆర్ ప‌క్కా దేశ ద్రోహి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప‌క్కా దేశ ద్రోహి అని ఆరోపించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంఐఎం పంచన చేరి తెలంగాణ రాష్ట్రం నుండి హిందువులని పంపిస్తావా అని ప్ర‌శ్నించారు.బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో హిందువుల పై జరుగుతున్న దాడులు కనపడతలేవా అని అన్నారు.

గతంలో ఎవరో ప్రధాని పై కామెంట్ చేస్తే సీఎం సీరియస్ అయ్యాడని.. వారిని బొక్కలో వేయాలని డీజీపీ కి చెప్పాడ‌న్నారు.ఇప్పుడు మేము డీజీపీ ని కోరుతున్నాం.. వెంటనే కేసీఆర్ ని బొక్కలో వేయాలని సంజయ్‌ అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్‌ వ్యాఖ్యలు దారుణమని అన్నారు. దేశ ప్రధానిని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని ,  ప్రపంచంలో భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిని ప్రధానిని విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రధానిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కేసీఆర్‌ అంత దుర్మార్గపు సీఎం ఎక్కడా లేరని విమర్శించారు సంజయ్‌ . కేసీఆర్‌ను చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు వైన్లు, బార్లే మిగిలుతాయన్నారు. చాయ్‌ పే చర్చ కాకుండా మందు పే చర్చ పెట్టమంటారా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫొటో పెట్టి మందు పే చర్చ పెడుదామన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరి ఓట్ల కోసం దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని నిలదీశారు.కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని ,  రాష్ట్రంలో హిందువులను ఉండనిస్తారా, లేదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ది నీచమైన చరిత్ర అని ఆయన అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీలు ఇస్తూ విడుదల చేసిన మేనిఫెస్టో తమ వద్ద ఉందని, వాటిలో ఏం చేశారని ఆయన అన్నారు.

దేశాన్ని తక్కువ చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఎంఐఎంకి అప్పగించాలనుకుంటున్నారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. ఎన్నికల్లో గెలవగానే ఆ ఫ్రంటు, ఈ ఫ్రంట్‌ అన్నారని, చివరికి కేసీఆర్‌కు టెంటు కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తే ఎవరూ పట్టించుకోరని బండి సంజయ్‌ అన్నారు