హైదరాబాద్: ఐపీఎల్ 19 లీగ్ దశలో భాగంగా శుక్రవారం (మే 22) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లే ప్రేక్షకులకు మల్కాజిగిరి సీపీ సుమతి కీలక సూచనలు చేశారు. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులు నిర్ణీత సమయానికి (గంట ముందే) స్టేడియంకి చేరుకుని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని చెప్పారు.
టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో మీ గేటుకు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉపయోగించుకోనీ మీ సీట్ నెంబర్ను దగ్గరికి చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైన్ బోర్డును ఫాలో అవ్వాలని సూచించారు. సైన్ బోర్డ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ గేటును గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చన్నారు.
►ALSO READ | చెన్నైకి బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తీవ్ర గాయం
కొన్ని ఫేక్ వెబ్సైట్స్ టికెట్ సెల్లింగ్ కోసం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని.. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ స్టేడియంలో ప్రదర్శించడం జరిగిందని.. ఎమర్జెన్సీ సమయంలో డయల్ 100 ని ఉపయోగించుకోవాలని సూచించారు.
