జ్యోతిష్యం:  రెండు కీలక గ్రహాలు మార్పు..శుక్రుడు కర్కాటక రాశిలోకి..కుజుడు వృషభ రాశిలోకి.. మే.. జూన్ నెలలో జరిగేది ఇదే.. 

జ్యోతిష్యం:  రెండు కీలక గ్రహాలు మార్పు..శుక్రుడు కర్కాటక రాశిలోకి..కుజుడు వృషభ రాశిలోకి.. మే.. జూన్ నెలలో జరిగేది ఇదే.. 

జ్యోతిష్య  శాస్త్ర ప్రకారం గ్రహాలు.. ఒక రాశి నుంచి మరో రాశిలో మారుతుంటాయి.  గ్రహాల కదలికలను బట్టి.. జీవరాశులస్థితిగతులు మారతాయి.  మే 18 న కర్కాటకరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు జూన్​ మధ్య వరకు అక్కడే సంచరిస్తుంటాడు,  అలాగే వృషభరాశిలో కుజుడు సంచరిస్తాడు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రుడు.. కర్కాటకరాశిలో... కుజుడు వృషభ రాశిలో సంచరించే సమయంలో ఖగోళంలో అనేక అద్భుతాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

కర్కాటకరాశిలో శుక్రుడు సంచరించే సమయంలో జీవరాశుల్లో భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది.  సెంటిమెంట్​ విషయంలో అనేక ఆందోళనలు కలుగుతాయి.  రొమాంటిక్ కామెడీలకు, ఎక్కువ డిమాండ్ ఉంటుంది.  ఒంటరిగా ఉన్నవారు కేవలం ఒంటరితనాన్ని పోగొట్టుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 

మే 18 నుంచి  జూన్ మధ్య భూమికి ..  జల రాశులకు ప్రత్యేక సంబంధం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంటే నీరు విచ్చలవిడిగా అనుకోకుండా వాడవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకు అగ్నిప్రమాదాలు సంభవించడం.. డ్రైనేజీలు పొంగి పొర్లడం.. ఇలా నీరు వృధా అంచనాకు మించి ఖర్చవుతుందని పండితులు చెబుతున్నారు. 

శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం:  శుక్రుడు.. కర్కాటక రాశి ఇవి రెండు అగ్ని..వాయువు.. జలానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తాయి.  వీటిలో ఏవైనా రెండు కలిస్తే దాని ప్రభావం కచ్చితంగా మూడో దానిపై ఉంటుంది.  ఉదాహరణకు అగ్ని.. వాయువు కలిస్తే.. జరిగే ఉపద్రవాన్ని నీరు శాంతింప చేస్తుంది.  ఇవి భూమిపై ప్రతాపం చూపితే దాని ప్రభావం చాలా ఎక్కువుగా ఉంటాయి. 

ప్రత్యేకంగా శుక్రుడి గురించి చెప్పాలంటే..  కర్కాటక రాశిలోకి ప్రవేశించడమే కాకుండా.. కర్కాటక రాశిలో గురుడితో కలిసి సంచరిస్తుంది.  వాస్తవానికి, శుక్రుడు మరియు గురుడు - రెండూ శుభ గ్రహాలు - జల రాశిలో కలిసి .  ముఖ్యంగా జలరాశులు..  భూ రాశుల వారికి - ఇప్పటికే ఉన్న స్నేహాలు, సంబంధాలు కుటుంబాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది .  అదనంగా ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది.  అయితే దానికి తగిన విధంగానే ఖర్చులు కూడా ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

కుజుడు వృషభ రాశిలో సంచరించే సమయంలో  భూమి కి సంబంధించి అనేక విషయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  భూమి అధిక ఒత్తిడికి గురవుతుంది.  సాధరణంగా జూన్​ నెలలో భూమిని తవ్వి నాట్లు వేస్తారు.  అంటే ఒక రకంగా భూమాతకు ఇబ్బంది కలిగించినట్టే కదా. ఇది మంచి పనికి కాబట్టి అంతగా భూమాత కూడా అంతగా ఇబ్బంది పడదు.  కాని అకాల వర్షాల వలన భూమి దెబ్బ తినడం.. అగ్ని సంస్కారం వలన భూమిలో అనేక మార్పులు సంభవిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వలన భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజుడు ప్లూటోతో చతురస్ర కోణంలోకి వస్తాడు.  ఇది ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంది.  జ్యోతిష్య శాస్తం ప్రకారం  మొత్తంమీద .. మే 18 నుంచి జూన్​ మధ్య వరకు భూమిపై జల..వాయువు మొదలగునవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.