13వ రోజు కొనసాగుతున్న బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

13వ రోజు కొనసాగుతున్న బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

జనగామ జిల్లా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ 13వ రోజు కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దేవరుప్పలలోని స్కూలులో చిన్నారుల మధ్య స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని వారితో ముచ్చటించారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని...అమరవీరుల లక్ష్యాలు...కలలను సాకారం చేసే బాధ్యతలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.

అనంతరం పాదయాత్రను ప్రారంభించారు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా దేవరుప్పల చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు బండి సంజయ్. బండి సంజయ్ కి దేవరుప్పల బీజేపీ  శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక యువత బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య బండి సంజయ్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మార్గం మధ్యలో అనేక చోట్ మహిళలు, ఆడ పడుచులు బండి సంజయ్ కి హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారు. 13వ రోజు పాదయాత్రలో భాగంగా ఇవాళ దేవరుప్పుల నుండి తండా, ధర్మపురం మీదుగా మైలారం శివారు వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.