మోడీ సభకు గిరిజనులు భారీగా తరలిరావాలి

మోడీ సభకు గిరిజనులు భారీగా తరలిరావాలి

సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను, ఎస్సీ వర్గానికి చెంది కోవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. అలాగే ఈ సారి ఎస్టీ వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయబోతున్నారన్నారు. ద్రౌపది ముర్ము ఎంపిక దేశవ్యాప్తంగా ఎస్టీ సామాజివర్గానికి దక్కిన  గుర్తింపు అన్నారు.