దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం కంటే దారుణ పాలన సాగిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అబద్దాలకోరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంతో కుమ్మక్కై రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ అమరవీరులను పొట్టనబెట్టుకున్న నిజాం గొప్ప వ్యక్తా..?.అని ప్రశ్నించారు సంజయ్. కుటుంబ పాలనకోసమే రాష్ట్రం ఏర్పడిందా..? అని అన్నారు. నిజమైన ఉద్యమకారులు తెరమరుగయ్యారని, ఉద్యమ ద్రోహులు రాజ్యం ఏలుతున్నారన్నారు. బీజేపీ నాయకులను కేసులతో బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మలిదశ ఉద్యమం ద్వారా గడీలు బద్దలుకొట్టి ముఖ్యమంత్రికి భయం ఏంటో చూపిస్తామని ఎంపీ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీది ఒకటే నినాదం, ఒకటే విధానం’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
