
ఉప్పల్, వెలుగు: దేశంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రధాని మోదీ పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఉప్పల్ సంజనా కాంప్లెక్స్ లో మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన, డిటెక్షన్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామచందర్రావు హాజరయ్యారు.
ఎన్నారై లతో వర్చువల్ మీటింగ్..
తార్నాక: అమెరికాలోని ప్రవాస భారతీయులతో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్రావు వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.