న్యూఢిల్లీ: అస్సాం, బెంగాల్ ఫలితాలు ప్రజల తీర్పు కాదు.. ఇవి బీజేపీ దొంగిలించిన ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత విమర్శించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) అండదండలతోనే ఈ ఓట్ చోరీ సాధ్యమైంది. మేం మమతా బెనర్జీ మాటలతో ఏకీభవిస్తున్నాం. బెంగాల్‌లో ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 100 కంటే ఎక్కువ సీట్లను బీజేపీ దొంగిలించింది. ఇది ఈరోజే కొత్తగా జరుగుతున్నది కాదు. మేం ఈ కుట్రపూరిత వ్యూహాన్ని ముందే చూశాం. మధ్యప్రదేశ్‌లో ఇదే జరిగింది.. హర్యానాలో ఇదే చేశారు.. మహారాష్ట్రలో కూడా ఇదే రిపీట్ అయింది. చివరకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిని పాటించారు. ఎన్నికల ప్రక్రియను, సంస్థలను నిర్వీర్యం చేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
