ఎమ్మెల్సీ సీట్లపై బీజేపీ గురి

ఎమ్మెల్సీ సీట్లపై బీజేపీ గురి
  • సిటీ నుంచి మళ్లీ రాంచందర్‌ రావుకే సీటు?
  • వరంగల్‌ టికెట్‌ కోసం పార్టీలో పెరిగిన పోటీ

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కమలం గురి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీటుతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంలో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ సిట్టింగ్ సీటును తిరిగి గెలుచుకోవడంతో పాటు వరంగల్ ఎమ్మెల్సీ సీటునూ తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ తరపున క్యాండిడేట్ల ఎంపిక, ప్రచారం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి తిరిగి రాంచందర్‌‌రావునే బరిలో నిలిపే ఆలోచనతో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత మల్లారెడ్డి సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నా సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు వైపే పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాంచందర్‌‌రావూ టికెట్ తనకే వస్తుందని మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

ఈసారి బలం పెరిగింది

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్ జిల్లాల్లో గతంతో పోల్చితే ఈసారి పార్టీ పరిస్థితి బాగా మెరుగైందని.. గ్రాడ్యుయేట్లయిన యూత్‌‌, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలూ బీజేపీ వైపు ఉన్నారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్‌‌పై వ్యతిరేకత, సీఎం కేసీఆర్ తీరుతో ఆగ్రహంగా ఉన్న ఈ వర్గాలు తమ వైపే మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఈ మూడు జిల్లాల నుంచి కూడా పలువురు ఇతర పార్టీల సీనియర్లు బీజేపీలో చేరడం, వారికి మంచి ఫాలోయింగ్ ఉండడంతో  తమకు ఈసారి మరింత ప్లస్ అవుతుందనే ధీమాలో నేతలున్నారు. సిట్టింగ్ సీటును తిరిగి గెలుచుకుంటామని గట్టిగా నమ్ముతున్నారు.

వరంగల్‌‌పైనా ఆశలు

వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంపైనా బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి మంచి రిజల్ట్స్‌‌ వచ్చాయి. పార్టీ తరపున పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్‌‌మోహన్‌‌రావు రెండో ప్లేస్‌‌లో నిలిచారు. టీఆర్ఎస్‌‌కు గట్టిపోటీనిచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుండా టీఆర్ఎస్‌‌ను అడ్డుకున్నారు. ఏడాదిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడైన గరికపాటి రామ్​మోహన్‌‌రావు కూడా బీజేపీలో ఉండటం పార్టీకి ప్లస్ అని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి వంటి సీనియర్ నేతల బలమూ ఉండటంతో గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే ఈసారి ఇక్కడి నుంచి పోటీకి బీజేపీలో తీవ్రమైన పోటీ ఉంది. పార్టీ రాష్ట్ర నేతలు పేరాల శేఖర్‌‌రావు, ప్రేమేందర్‌‌రెడ్డి, మనోహర్‌‌రెడ్డి, కాచం వెంకటేశ్వర్లు