H-1B వీసాపై 2017లోనే రాహుల్ గాంధీ హెచ్చరిక.. మోదీ, ట్రంప్పై చేసిన ట్వీట్ వైరల్

H-1B వీసాపై 2017లోనే రాహుల్ గాంధీ హెచ్చరిక.. మోదీ, ట్రంప్పై చేసిన ట్వీట్ వైరల్

H-1B వీసాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది.  H-1B వీసాపై అమెరికాలోకి రావాలంటే ఏడాదికి లక్ష డాటర్ల చెల్లించాలనే నిబంధనతో తమ దేశ యువత ఉపాధి కోల్పోతారని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఇండియాపైనే పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ట్రంప్ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై కాంగ్రెస్ మండి పడింది. ఇది మొదటి సారి కాదని.. ఇండియాను ట్రంప్ టార్గెట్ చేస్తున్నప్పటికీ.. మన ప్రధాని మోదీకి ఎదుర్కొనే ధైర్యం లేదని కాంగ్రెస్  సీనియర్ నేత పవన్ ఖేరా అన్నారు. 

ట్రంప్ కుట్రలపై రాహుల్ గాంధీ 2017 లోనే హెచ్చరించాడు. 2017, జులై 5వ తేదీన .. ఇలాంటి కుట్ర జరుగుతోందని రాహుల్ మోదీని హెచ్చరించారు. ఏదైనా చేయాలని.. అమెరికా వెనక్కు తగ్గేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కానీ మోదీ బలహీన ప్రధాని.. అప్పుడూ ఏం చేయలేకపోయారు.. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటారు అని విమర్శించారు. 

ట్రంప్ నిర్ణయంతో కోట్ల మంది యువత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రతి రోజూ భారత్ ను అవమానిస్తున్నారు.. కానీ మోదీ మౌనంగా ఉంటారు.. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని.. ట్రంప్ లయర్ అని పార్లమెంటులో చెప్పాలని మోదీకి రాహుల్ ఒక సూచన.. అవకాశం ఇచ్చారు. కానీ ఆయన అనలేకపోయారు. అప్పుడు దేశం అంతా మోదీ వెనకే ఉన్నాం.. కానీ ఇప్పుడు దేశం మొత్తం ప్రధానిని ప్రశ్నిస్తోంది... అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

2017లో రాహుల్ ఏం ట్వీట్ చేశారు:

H-1B వీసా అంశంపై 2017లో రాహుల్ గాందీ చేసిన ట్వీట్ మళ్లీ వైరల్ గా మారుతోంది. అప్పట్లో అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ.. వీసా రూల్స్ పై ట్రంప్ తో మాట్లాడతారని అందరూ భావించారు. కానీ ఆయన సైలెంట్ గా .. ఏం మాట్లాడకుండా ఇండియా వచ్చారు. అదే విధంగా ఇండియా పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ అని చేసిన వ్యాఖ్యలను కూడా మోదీ ఖండించలేక పోయారు.. అనే పోస్టులను ట్వీట్ చేశారు. ఇండియాకు చాలా బలహీన ప్రధాని ఉన్నారు అంటూ చేసిన ట్వీట్ గురించి పవన్ ఖేరా చెప్పడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది.