
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ తోపాటు తమిళనాడు వాసులకు ఎంతో పవిత్రమైన పెరటాశి మాసం మొదటి శనివారం ( September 20) కావడంతో భక్తులు పోటెత్తారు. నారాయణగిరి షెడ్ల వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.
రేపటి ( september 21) నుంచి తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు ఇచ్చారు. దీంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమేగుతున్నాయి. టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, 300 రూపాయిల- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు...
శుక్రవారం(సెప్టెంబర్ 19) తిరుమల శ్రీవారిని 71 వేల 249 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22 వేల 901మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్ల 4 లక్షలు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు..