- 56 దేశాలకు నిధులిచ్చే స్థాయికి ఎదిగిన దేశం: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని 55 ఏండ్లు పాలించినప్పటికీ.. కాంగ్రెస్ హయాంలో భారత్ ఎప్పుడూ స్వతహాగా నిలబడలేదని, ఇతర దేశాల సహాయంపై ఆధారపడాల్సి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఒకప్పుడు అమెరికా పీఎల్ -480 చట్టం ద్వారా మన దేశానికి పాలపొడి డబ్బాలు పంపేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మా రిందని.. ఏకంగా 56 దేశాలకు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగామని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ఆఫీస్లో ‘ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్’ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ జరిగింది.
ఈ వర్క్‌షాప్‌కు రాం చందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు మన దేశాన్ని బంగారు పక్షి (సోనే కి చిడియా) అని పిలిచేవారని.. శతాబ్దాల దండయాత్రలతో దేశం ముక్కలైందన్నారు. గతంలో రక్షణ సామగ్రి కావాలంటే లక్షల కోట్లు పోసి విదేశాల కాళ్లు పట్టుకునేవాళ్లమని.. కానీ, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.
