పౌల్ట్రీ ఎగ్జిబిషన్కు రండి.. సీఎం రేవంత్కు ఆహ్వానం

 పౌల్ట్రీ ఎగ్జిబిషన్కు రండి.. సీఎం రేవంత్కు ఆహ్వానం

హైదరాబాద్​, వెలుగు:  నవంబర్ 25–28 తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహిస్తున్న  పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025కు రావాలని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ సీఎం రేవంత్​రెడ్డిని కోరింది. ఇది దక్షిణాసియాలోనే  అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ అని అసోసియేషన్​ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ చెప్పారు. 

ఇందులో 1,500కి పైగా ప్రతినిధులు,  అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ,  ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై  చర్చిస్తారు.