రష్యా చమురుకు రిలయన్స్ నో

రష్యా చమురుకు రిలయన్స్ నో

న్యూఢిల్లీ:  యూరోపియన్​ యూనియన్​(ఈయూ) ఆంక్షల కారణంగా గుజరాత్ జామ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని  తన ఎగుమతి ఆధారిత రిఫైనరీలో (సెజ్) రష్యా ముడి చమురు వాడకాన్ని నిలిపివేసినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ నెల 20 నుంచే సెజ్ రిఫైనరీలో రష్యా చమురు దిగుమతి ఆగిపోయింది.

 వచ్చే నెల నుంచి సెజ్ ద్వారా జరిగే ఎగుమతులన్నీ రష్యాయేతర చమురువే ఉంటాయి. 2026 జనవరి నుంచి అమలులోకి రానున్న ఈయూ ఆంక్షల వల్లే ఈ నిర్ణయం తీసుకుంది.  మనదేశానికి వస్తున్న1.7-1.8 మిలియన్ బ్యారెళ్ల (ప్రతిరోజు) రష్యా చమురులో రిలయన్స్​ దాదాపు సగం కొనుగోలు చేసింది.