ఆరోగ్య బీమా మోసాలతో ఏటా రూ.10 వేల కోట్ల నష్టం.. బీమా వ్యవస్థపై తగ్గుతున్న నమ్మకం

ఆరోగ్య బీమా మోసాలతో ఏటా రూ.10 వేల కోట్ల నష్టం.. బీమా వ్యవస్థపై తగ్గుతున్న నమ్మకం
  • రెండు శాతం క్లెయిమ్స్లో​మోసాలు.. 
  •     అక్రమాలకు టెక్నాలజీతో చెక్​పెట్టొచ్చు
  •     మెడి అసిస్ట్ రిపోర్ట్​ వెల్లడి


న్యూఢిల్లీ: మోసాలు, దుర్వినియోగం, ఇతర పొరపాట్ల వల్ల ఆరోగ్య బీమా కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నట్టు వెల్లడయింది. ‘ఫ్రాడ్​, వేస్ట్​, అబ్యూజ్’ (ఎఫ్​డబ్ల్యూఏ) కారణంగా ఏటా సుమారు రూ. వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని బీసీజీ,  మెడి అసిస్ట్  రిపోర్ట్​ పేర్కొంది. నకిలీ బిల్స్​తో బీమా డబ్బు పొందడం, లేని రోగానికి ట్రీట్​మెంట్ ​తీసుకున్నట్లు చూపించడం,  ఆసుపత్రులు, డాక్టర్లు అవసరానికి మించి పరీక్షలు, చికిత్సలు చేసి అధిక బిల్లులు వేయడం వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. 

బీమా కంపెనీల అంతర్గత విధానాల్లో లోపాల వల్ల కూడా అనవసరంగా డబ్బు ఖరవుతోంది.  ఏఐ, జెన్​ఏఐ ద్వారా క్లెయిమ్స్ ప్రాసెస్​ చేయాలని, ఫలితంగా మోసాలు జరగకముందే గుర్తించి అడ్డుకోవచ్చని రిపోర్ట్​ సూచించింది.  ప్రస్తుతం ఇండియా హెల్త్​ఇన్సూరెన్స్​ మార్కెట్​సైజు 1.27 లక్షల కోట్లు కాగా, 2030 నాటికి సుమారు 2.6–3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశ ఆరోగ్య బీమా రంగంలో మొత్తం క్లెయిమ్స్ లో 90 శాతం రిస్క్ లేనివే ఉంటున్నాయి. రెండు శాతం క్లెయిమ్స్ మాత్రమే మోసపూరితమైనవి.