ఏ మొఖం పెట్టుకుని గ్రాడ్యుయేట్లను ఓట్లడుగుతున్నారు

ఏ మొఖం పెట్టుకుని గ్రాడ్యుయేట్లను ఓట్లడుగుతున్నారు
  • బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ

జనగామ జిల్లా: నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటివరకు ఇవ్వలేదు.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని గ్రాడ్యుయేట్లను ఓట్లు అడుగుతున్నారని బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే అరుణ ప్రశ్నించారు. ఘంటా చక్రపాణి 33 వేల ఉధ్యోగాలు కల్పించామని నివేదిక ఇస్తే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1.31 లక్షల ఉధ్యోగాలు కల్పించామని అబద్దం చెబుతూ ఓట్లు అడుక్కుంటున్నడని ఆమె విమర్శించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రం లో బీజేపి పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పే అవకాశం గ్రాడ్యుయేట్లకు వచ్చిందని,  టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించి వాళ్లకు బద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగు పడతాయని ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన విధ్యార్ధులు ఇప్పుడు బాధపడుతున్నరని ఆమె పేర్కొన్నారు. కేసిఆర్ కుటుంబ పాలనకు బానిసలైదామా..? ఒకసారి ఆలోచించండి..  టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికే సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు… ఆ పధకాలు వాళ్ల ఇంటిలోనుంచి తీసి ఇస్తున్నరా సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. కేసిఆర్ ను ఎదుర్కొనే దమ్ము, దైర్యం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ.. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్చ రావాలనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించారు.. తెలంగాణ రాష్ట్రం లో బీజేపి బలం పెంచాలంటే గ్రాడ్యుయేట్లు రెండు స్థానాలలో బీజేపి అభ్యర్థులను గెలిపించాలి.. అని డీకే అరుణ కోరారు. పాఠశాలల్లో టీచర్లకు ప్రమోషన్లు లేవు, కొత్త నియామకాలు లేవు, సిబ్బంది కూడా లేరు,  దాదాపు 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

బదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్