మళ్లీ మోడీ వస్తే.. ఈ షేర్లకు లాభాలే లాభాలు.. CLSA అంచనా

మళ్లీ మోడీ వస్తే.. ఈ షేర్లకు లాభాలే లాభాలు.. CLSA అంచనా

జూన్ 4వ తేదీ.. మోదీ మళ్లీ గెలుస్తారా లేక ఓడిపోతారా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశంలోని లోక్ సభ రిజల్ట్స్ పై ఆసక్తి చూపుతుంది. ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు జూన్ 4వ తేదీపైనే ఉంది. అందులో భాగంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ పైనా రాబోయే ఫలితాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుందని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కమర్షియల్ లైసెన్స్ అండ్ సపోర్ట్ ఏజెన్సీ అయిన సీఎల్ఎస్ఏ.. అంతర్జాతీయ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 

మళ్లీ బీజేపీ గెలిచి.. మోదీ ప్రధానమంత్రి అయితే ఈ షేర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుందని.. భారీ లాభాలు వస్తాయని.. మోదీ గెలిస్తే ఈ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చని అంచనా వేసింది. మోడీ స్టాక్స్ పేరుతో రిలీజ్ అయిన నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం 54 కంపెనీల షేర్లను మోడీ స్టాక్స్ గా వెల్లడించింది సీఎల్ ఎస్ఏ.. అవేంటో చూద్దాం..

>>> L&T, NTPC, NHPC, PFC, ONGC, IGL, Mahanagar Gas
>>> SBI, HDFC Bank, ICICI Bank, Axis Bank, IndusInd Bank, Power Finance
>>> Ashok Leyland, UltraTech, L&T, Bajaj Finance, Max Financials, Zomato, DMart
>>> Bharti Airtel, Indus Towers, Reliance Industries

మోడీ మళ్లీ గెలిస్తే.. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ కు సంబంధించి 54 కంపెనీల షేర్లకు భవిష్యత్ లో మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తుంది. పబ్లిక్ సెక్టార్ లోని బ్యాంకింగ్, ఆయిల్, ఇన్ ఫ్రా, టెలికాం, సర్వీస్, ఫైనాన్స్ కంపెనీ షేర్లకు మంచి డిమాండ్ ఉంటుందని నివేదిక వెల్లడించింది  సీఎల్ఎస్ఏ.