
పార్టీ మెంబర్‌షిప్‌తోపాటు చేరికలపైనా బీజేపీ దృష్టి సారించింది. అన్ని జిల్లాల్లో పార్టీకి బలమైన నేతలు ఉండాలన్న లక్ష్యంతో ఉంది. రెండు నుంచి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను ప్రభావితం చేయగల లీడర్లపై పార్టీ గురిపెట్టినట్టు సమాచారం. అలాగే ఇతర పార్టీల నుంచి చేరిన నేతలను ఖాళీగా ఉంచకుండా సభ్యత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయాలని హైకమాండ్ సూచించింది. దీంతో వారికి పాత, కొత్త జిల్లాలకు సభ్యత్వ నమోదు పరిశీలన బాధ్యతలు అప్పగించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణను నిజామాబాద్, సూర్యాపేటకు, జితేందర్ రెడ్డిని కరీంనగర్, నాగర్ కర్నూల్‌కు, పొంగులేటి సుధాకర్ రెడ్డిని కొత్తగూడెం, చాడ సురేశ్ రెడ్డిని వనపర్తి, మహబూబాబాద్, బోడ జనార్దన్‌ను గద్వాల, మంచిర్యాలకు, శశిధర్ రెడ్డిని వరంగల్ రూరల్, సంగారెడ్డికి, విజయరామారావుకు జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో మెంబర్‌షిప్ బాధ్యతలు అప్పగిం చారు. కాంగ్రెస్, టీడీపీలోని లీడర్లతోపాటు టీఆర్ఎస్‌లోని అసంతృప్తులపైనా పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌లోని కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు.