
సైబర్ క్రైమ్స్..టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ..ఈ సైబర్ క్రైమ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రోజుకో విధంగా సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాలకు చిల్లులు పెడుతున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, డిజిటలైజేషన్తో ప్రతిఒక్కరూ తమ లావాదేవీలకు సంబంధించి ఆన్లైన్ పేమెంట్స్,ఇతరు బ్యాంకింగ్ వ్వవహారాలు స్మార్ట్ఫోన్, డెస్క్టాప్లు, ల్యాప్టాప్ల ద్వారా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ రిటైర్డు IAS అధికారిణిని బోల్తా కొట్టించి కోట్లు దోచుకున్నారు సైబర్ ఫ్రాడ్స్టర్లు..వివరాల్లోకివెళితే..
ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్ తో సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ను బోల్తా కొట్టించారు. స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే మంచిలాభాలు వస్తాయి.. ధని సెక్యూరిటీస్ అనే ఫేక్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని APK ఫైల్ ను డౌన్ లోడ్ చేయమని బాధితురాలిని ఒప్పించారు. ఇది నిజమైన ట్రేడింగ్ ప్లాట్ ఫాం నుపోలి ఉండేలా రూపొందించిన నకిలీ అప్లికేషన్. అర్జున్ రమేష్ మెహతా పేరుతో కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ గా ఫ్రాడ్ స్టర్ పరిచయం చేసుకొని అధిక రాబడి వస్తుందని నమ్మించి మోసం చేశారు.
ALSO READ | ఆర్మీలో జాబ్స్ పేరిట సైబర్ వల...హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్లోని సోమాజాగూడకు చెందిన 72 యేళ్ల రిటైర్డు IAS అధికారిణిని సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించి కోట్లు దోచుకున్నారు. ఫేక్ స్టాక్ ట్రేండ్ యాప్ ను నిర్వహిస్తున్న మోసగాళ్లు ఆమెనుంచి రూ.3.37కోట్లు దోచుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన బాధితురాలు..ఈ సంఘటనను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి రిపోర్టు చేసింది.
మ్యూచువల్ ఫండ్స్, IPO, అప్షన్స్ ట్రేడింగ్ పై 90 శాతం లాభం రేటుతో AI ఆధారిత ఎక్విప్ మెంట్లు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. మార్చి నుంచి మే వరకు, ఆ అధికారి రూ.28వేల నుంచి రూ.50 లక్షల వరకు దఫాలుగా లావాదేవీలు జరిపారు. మొత్తం రూ.3.3 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు బాధితులకు పోలీసులకు తెలిపింది.
అనుకున్నట్లుగానే 90 శాతం లాభాలు వచ్చాయి.. మీరు డ్రా చేసుకోవాలంటే.. అదనంగా మరో 33.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్రాడ్ స్టర్లు బాధితురాలికి చెప్పడంతో అసలు కథ బయటపడింది. ఫ్రాడ్ స్టర్లు మాటలు, హామీలపై అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 319(2),338,ఐటీ చట్టంలోని సెక్షన్ 66-D కింద కేసు నమోదు చేసినట్లు TGCSB అధికారులు చెప్పారు. నిందితులను గుర్తించి పట్టుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రస్తుతం బ్యాంకు లావాదేవీలు,డిజిటల్ ఆధారాలను ట్రాక్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.