
ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో మరో సారి విజృంభించింది. ఆదివారం (మే 18) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ సెట్ చేసింది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహాల్ వధేరా(37 బంతుల్లో 70:5 ఫోర్లు,5సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ కు తోడు శశాంక్ సింగ్(30 బంతుల్లో 59:5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు పంజాబ్ ఇన్నింగ్స్ లో హైలెట్ గా నిలిచాయి. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు.. మఫాకా, పరాగ్, ఆకాష్ మాద్వాల్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు పవర్ ప్లే లో మంచి ఆరంభం లభించలేదు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాజస్థా పేసర్లు దేశ్ పాండే, మఫాకా చెలరేగడంతో ఆర్య (9), ఓవెన్ (0) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కాసేపు మెరుపులు మెరిపంచిన ప్రబ్ సిమ్రాన్ సింగ్ 21 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా నిలబెట్టారు.
ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్ కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 67 పరుగుల భాగస్వామ్యం తర్వాత శ్రేయాస్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒక ఎండ్ లో వధేరా మాత్రం బౌండరీలతో చెలరేగాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వధేరా.. 37 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో శశాంక్ సింగ్, ఓమర్జాయ్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 200 పరుగుల మార్క్ చేరుకుంది. తొలి 10 ఓవర్లలో 97 పరుగులు చేసిన పంజాబ్.. చివరి 10 ఓవర్లలో 122 పరుగులు రాబట్టుకుంది.
Wadhera - 70(37).
— Tanuj (@ImTanujSingh) May 18, 2025
Shashank - 59*(30)
Shreyas - 30(25).
Azmatullah - 21*(9).
After 34/3, Punjab Kings posted 219/5 in 20 overs against Rajasthan Royals - What a tremendous Comeback by Punjab Kings. 👏 pic.twitter.com/OytCqg84Mb