
ఢాకా: ప్రముఖ బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియా అరెస్ట్ అయ్యారు. హత్యాయత్నం ఆరోపణలపై ఢాకా విమానాశ్రయంలో ఆదివారం (మే 18) పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ 'ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్'లో నటి నుస్రత్ ఫరియా కీ రోల్ ప్లే చేసింది. ఈ మూవీలో నుస్రత్ బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ALSO READ | RenuDesai: సెన్స్ లేని టీవీ షోలు చూడటం మానేసి.. దేశం గురించి మాట్లాడుకోవడం మొదలుపెడదాం
ఇదిలా ఉంటే.. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా హత్యాయత్నం ఆరోపణలపై దాఖలైన కేసులో నటి ఫరియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ క్రమంలో ఆదివారం (మే 18) ఉదయం థాయిలాండ్‌కు వెళుతుండగా షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద నటి ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫరియా అరెస్టును బద్ద జోన్‌లోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ షఫీకుల్ ఇస్లాం ధృవీకరించారు. ఆమెను ఢాకాలోని వతారా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు.
ALSO READ | మాయావతి మేనల్లుడికి పెద్ద పోస్ట్.. బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్గాఆకాష్ ఆనంద్
రేడియో జాకీ, ప్రెజెంటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఫరియా నుస్రత్ 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్త నిర్మాణ చిత్రం 'ఆషికి: ట్రూ లవ్'లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో దివంగత దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ 'ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్'లో నటి నుస్రత్ ఫరియా బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనా పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది.