కరెంట్ షాక్తో 14 గేదెలు మృతి..లబోదిబోమంటున్న రైతులు

కరెంట్ షాక్తో  14 గేదెలు మృతి..లబోదిబోమంటున్న రైతులు

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో 14 గేదెలు చనిపోయాయి. ఈ ఘటన మే 18న జరిగింది.  మందమర్రి మండలం అమరావతి గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులకి చెందిన 14 గేదెలు మృతి చెందాయి.  కూరగాయల తోటల పంటకు  విద్యుత్ తీగలు అమర్చారు రైతులు. 

అయితే ప్రమాదవశాత్తు వైర్లు పక్కనున్న చెరువులో  పడిపోయాయి.  నీటి కోసం  చెరువులో దిగిన గేదెలకు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలగడంతో అక్కడిక్కడే మృతి చెందాయి.  పాలు ఇచ్చే గేదెలు మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. 

ALSO READ | మీర్ చౌక్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా