
Gold From Lead: భారతీయులకు పసిడితో ఉన్న సంబంధం విడతీయలేనిది. ఎంత బంగారం ఉన్నా ఇంకో గ్రాము కొనుగోలు చేసేందుకే ఇండియన్ ఫ్యామిలీస్ ప్రయత్నిస్తుంటాయి. సాంస్కృతికంగా కూడా బంగారంతో భారతీయ కుటుంబాలకు విడదీయలేని సంబంధం ఉండటమే దీనికి కారణం. అరుదుగా దొరికే ఈ లోహం రానున్న కాలంలో అపరిమితంగా లభించేలా చేసేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను తెచ్చిపెట్టినట్లు వెల్లడైంది. ఇప్పటికే ల్యాబ్‌లలో తయారైన డైమండ్స్ మార్కెట్లో దొరకటం మనం గమనిస్తూనే ఉన్నాం.
వాస్తవానికి 17 వందల దశకంలో పోలాండ్ రాజు జాన్ ఫ్రెడరిక్ బాట్గర్ అనే శాస్త్రవేత్తను ఒక రూములో భందించాడు. కేవలం బంగారం తయారు చేయాలంటూ అతడిని ఆదేశించినప్పటికీ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. కానీ ప్రస్తుతం 300 ఏళ్ల తర్వాత దీనిని సీఈఆర్ఎన్ సైన్టిస్టులు నిజం చేశారు. వారు సీసాన్ని బంగారం మార్చినట్లు వెల్లడైంది. అయితే ఇది అంత సులువుగా మాత్రం జరగలేదని తేలింది. ప్రపంచంలోనే అతిపెద్ద, శక్తివంతమైన లార్జ్ హాడ్రన్ కొలైడర్ ఇందుకోసం వినియోగించినట్లు వారు పేర్కొన్నారు.
2015 నుంచి 2018 వరకు వీరు చేపట్టిన పరిశోధనల్లో 86 బిలియన్ గోల్డ్ అణువులను తయారు చేసినప్పటికీ అవి కొద్దిసేపటి తర్వాత వేరే వాటిగా మారిపోయాయి. వాస్తవానికి ఈ ప్రక్రియల ద్వారా తయారు చేయబడిన గోల్డ్ చాలా తక్కువగా వారు వెల్లడించారు. దీంతో ప్రస్తుత పరిశోధనల ద్వారా నూక్లియర్ ట్రాన్స్‌మ్యుటేషన్ ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చని, అయితే అది భారీ ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ విధంగా తయారయ్యే బంగారం కేవలం పరిశోధన అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని, వాస్తవ వినియోగానికి పనికిరాదని వాళ్లు చెబుతున్నారు.
అసలు శాస్త్రవేత్తలు లెడ్ నుంచి బంగారాన్ని ఎలా తయారు చేస్తున్నారు..?
వాస్తవానికి శాస్త్రవేత్తలు పాదరసం, ప్లాటినం లేదా సీసం వంటి మూలకాల పరమాణు నిర్మాణాన్ని అణు ప్రక్రియలు లేదా లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లో అధిక శక్తి కణ తాకిడి ద్వారా బంగారాన్ని సృష్టిస్తారు. కానీ ఇది భారీ ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆచరణ సాధ్యం కానందున్న ఇప్పటికీ భూమిలో దొరికే బంగారాన్ని గనుల నుంచి ప్రాసెస్ చేయటమే కొనసాగుతోంది.