10 ఏళ్లలో కోటీశ్వరుడు కావాలనుందా..? ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో పక్కా ప్లాన్ ఇదిగో..!

10 ఏళ్లలో కోటీశ్వరుడు కావాలనుందా..? ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో పక్కా ప్లాన్ ఇదిగో..!

భారతదేశంలో సంపద సృష్టి, మధ్యతరగతి నుంచి రిట్ కావాలని కోరుకుంటున్న యువత సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆశ ఉన్నప్పటికీ ఆశయాన్ని చేరుకోవటానికి సరైన ప్లాన్ లేక చాలా మంది ఇప్పటికీ వెనకబడిపోతున్నారు. కోటీశ్వరుడు అనే ట్యాగ్ కోసం తహతహలాడితే సరిపోదు అందుకు అవసరమైన ప్లాన్ కూడా ముఖ్యమే. ఈ క్రమంలో కోటీశ్వరులుగా మారటానికి ఒక పెట్టుబడి బ్లూ ప్రింట్ ప్రణాళిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పెట్టుబడులపై అవగాహన పెరుగుతున్న భారతీయుల్లో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ప్లాన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతి నెల స్థిరమైన పెట్టుబడి, సమయంతో సాధారణ ఉద్యోగులు కూడా కోట్ల రూపాయల సంపదను సృష్టించే బలం అని పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు శరణ్ హెగ్డే చెప్పాడు. కోటీరుపాయలు సంపాదించటం నిజంగా లగ్జరీ కాదని ఆర్థిక స్వేచ్ఛలోకి అడుగుపెట్టడంగా చెప్పారు. ఆదాయం కంటే క్రమశిక్షణతో చేసే పెట్టుబడే విజేతలను సిద్ధం చేస్తుందని సూచించారు శరణ్. 

మనలో చాలా మందిలో ఉండే భ్రమ.. ఎక్కువ సంపాదించేవాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. వాడికేంటి బాస్ ఫైనాన్షియల్లీ సెటిల్డ్ అంటుంటారు సహజంగా. కానీ అసలు రహస్యం పెద్ద జీతాలు, ఆదాయాలు పొందటంలో ఉండదు.. దానిని సరిగ్గా ఇన్వెస్ట్ చేయటంలో ఉంటుందని గుర్తించాలి. చాలా మంది లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ మాయలో చిక్కుకుని.. కార్లు, ఖరీదైన ఫ్లాట్లు, బ్రాండెడ్ వస్తువులు అంటూ విపరీతంగా ఖర్చు చేసి సంపాదిస్తున్న పేదవారిగానే మిగిలిపోతుంటారు. జీవితం అదుపులో లేకపోతే జీతం పెరిగినా యూజ్ ఏం ఉండదు అని గుర్తించాలి ముందుగా. 

10 ఏళ్లలో కోటి సంపాదించడానికి ప్లాన్..

* సంవత్సరానికి కనీసం రూ.12 లక్షల నికర ఆదాయం ఉండాలి. దానిలో 30 శాతం సేవింగ్ చేయాలి.
* ప్రతి సంవత్సరం ఆ సేవింగ్ రేట్‌ను 10% పెంచాలి.
* SIPలలో పెట్టుబడి పెట్టి సగటుగా 12–15% వార్షిక రాబడి సాధించేలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి.

నెలకు రూ.30వేలు పెట్టుబడిగా ఎందులో పెట్టాలి..

1. ప్రతి నెల రూ.18వేలు ఇండియన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.
2. రూ.3వేలు యూఎస్ మార్కెట్లలో ప్రతినెల పెట్టాలి.
3. రూ.4,500 బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేయాలి.
4. రూ.3వేలు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌ ఇచ్చే పథకాల్లో ఉంచాలి.
5. చివరిగా రూ.1,500 క్రిప్టోలో పెట్టవచ్చు.

పైన ఇన్వెస్టర్లు కేవలం ఒక కేటగిరీ పెట్టుబడి మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా.. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా పెట్టుబడిగా అలకేట్ చేయాలో ఉదహరిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యమైనది పెట్టుబడిని ప్రతినెల క్రమం తప్పకుండా కొనసాగించటమేనని గుర్తుంచుకోవాలి. 

కోటీశ్వరుడి లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ 3 తప్పనిసరి.. 

  • సరైన హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని తప్పక తీసుకోవటం
  • కుటుంబ ఒత్తిడితో లేదా లోన్లతో ఖర్చులు పెరగకుండా చూసుకోవటం
  • బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం మానుకోవటం