
టీమిండియాతో జూన్ 20 నుంచి జరగనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు భారత జట్టు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉంటే.. మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటి నుంచే సిరీస్ ఎలా గెలవాలనే వ్యహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా . సొంత గడ్డపై ఇంగ్లాండ్ తమ దేశంలో భారత్ పై ఆధిపత్యం చెలాయించడానికి న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అపార్ టెస్ట్ అనుభవం ఉన్న సౌథీ శుక్రవారం (మే 16) ఇంగ్లాండ్ జట్టుతో కలిశాడు. అండర్సన్ స్థానంలో ఈ కివీస్ పేసర్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళానికి తన సలహాలు ఇవ్వనున్నాడు.
36 ఏళ్ల సౌతీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే ది హండ్రెడ్ లీగ్ లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరపున ఆడనున్నాడు. "ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలో అపార అనుభవంతో సౌథీ ఆటగాళ్లకు విలువైన సలహాలు అందిస్తాడు".అని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమ్మర్ లో ఇంగ్లాండ్ ప్రారంభ మ్యాచ్ జింబాబ్వేతో మే 22న ట్రెంట్ బ్రిడ్జ్ లో ఆడనుంది. ఈ మ్యాచ్ కు సౌథీ తన బాధ్యతలు స్వీకరిస్తాడని ఈసీబీ తెలిపింది.
2024 లో ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వీడ్కోలు పలికిన వెంటనే ఇంగ్లాండ్ జట్టు జేమ్స్ ఆండర్సన్‌ను కన్సల్టెంట్ రోల్ కోసం సంప్రదించగా అండర్సన్ అంగీకరించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అండర్సన్.. ఇంగ్లాండ్ డొమెస్టిక్ టోర్నీ లంకాషైర్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడతానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కారణంగానే అండర్సన్ భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండ్ కన్సల్టెంట్‌గా ఉండట్లేదు.
►ALSO READ | AB De Villiers: అలా జరిగితే నేను RCB మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వస్తాను: ఏబీ డివిలియర్స్
సౌథీ గత ఏడాది నవంబర్ 15 న తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2008 లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ళ పాటు కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. కివీస్ తరపున ఈ కివీస్ పేసర్ 107 టెస్టుల్లో ఆడాడు. 201 ఇన్నింగ్స్ లో 391 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనతను 15 సార్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు.
Tim Southee has joined England men's coaching staff as a specialist skills consultant.
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2025
The former New Zealand pace bowler joins on a short-term basis through to the end of the India Test series pic.twitter.com/XVm398hy1t