సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ పిటిషన్

సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ పిటిషన్

సిట్ నోటీసులపై బీజేపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, అడ్వొకేట్ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నోటీసులపై స్టే ఇవ్వాలని అందులో అభ్యర్థించారు. కేసుతో సంబంధం లేని వారికి నోటీసులిచ్చి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మధ్యాహ్నం 2:30కి విచారణ జరపనుంది. 

ఇదిలా ఉంటే ఫాం హౌస్ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోనే సిట్ పలువురికి నోటీసులు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చింది. అయితే కుట్రలో భాగంగానే వారికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది.