
న్యూఢిల్లీ : పరీక్షల సమయంలో ఎన్నికల ప్రచారం తగదంటూ ఇటీవల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మైకులు, లౌడ్ స్పీకర్ల వాడకాన్ని బ్యాన్ చేసింది. దీనిపై బీజేపీ సుప్రీంలో పిటీషన్ వేయగా..దానిపై ఇవాళ తీర్పు వెల్లడైంది. ఈ పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీల కంటే పరీక్షలే ముఖ్యమని తీర్పు చెప్పింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు.. విద్యార్ధుల భవిష్యత్ తో ముడిపడిన పరీక్షలే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీరు న్యాయస్ధానాన్ని ఆశ్రయించినా, ఈసారి విద్యార్ధులు పరీక్షలు రాసే సమయమిదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అన్నారు. పరీక్షలు ముఖ్యమేనని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాము (రాజకీయ పార్టీలు) ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం తోసిపుచ్చలేనిదని తెలిపారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ. ఎలాంటి సౌండ్ లేకుండా ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
Supreme Court dumps BJP's plea challenging Ban on Loudspeakers in Poll Campaigning In West Bengal – The Indian Wire https://t.co/VG91Qm1plB
— The Indian Wire (@theindianwire) February 11, 2019