శేరిలింగంపల్లిలో బీజేపీ గెలుపు ఖాయం: గజ్జల యోగానంద్

శేరిలింగంపల్లిలో  బీజేపీ గెలుపు ఖాయం: గజ్జల యోగానంద్

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు జనం తగిన బుద్ధి చెబుతారని.. శేరిలింగంపల్లిలో బీజేపీ గెలుపు ఖాయమని సెగ్మెంట్ ఇన్​చార్జి గజ్జల యోగానంద్ తెలిపారు. ప్రజా సమస్యలపై సెగ్మెంట్ పరిధిలో ఆయన చేపట్టిన పాదయాత్ర 64వ రోజుకు చేరింది. 
గురువారం వివేకానందనగర్ డివిజన్, రామకృష్ణనగర్, ఆర్పీ కాలనీల్లో యోగానంద్ పర్యటించారు. స్థానిక జనం, కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాలు చేయడం తప్ప స్థానిక సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యోగానంద్ వెంట డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, నాయకులు ఉన్నారు.