మంత్రి సబితకు సొంత నియోజకవర్గంలో నిరసనల సెగ

మంత్రి సబితకు సొంత నియోజకవర్గంలో నిరసనల సెగ

మహేశ్వరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. మహేశ్వరం మీదుగా ఆమె వెళ్తున్న సమయంలో అడ్డుకున్న బీజేవైఎం నేతలు.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యలేని ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేకుంటే వారిని తిరగకుండా అడ్డుకుంటామన్నారు. ఈ క్రమంలో బీజేవైఎం నాయకులను పోలీసులు మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించగా, పోలీస్ స్టేషన్ ముందు బెటాయించారు. 1200మంది యువత తమ ప్రాణత్యాగం చేసుకొని సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. దీంతో కాన్వాయ్ నుంచి బయటకు దిగిన సబిత.. బీజేవైఎం నేతలతో మాట్లాడేందుకు యత్నించినా కుదర్లేదు. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి.. మంత్రి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు.